కోయిలకు ఏడాదికి ఒక్కవసంతం మాత్రమే... కానీ, నేను మాత్రం కాలచక్రపు కదలికలకు స్పందిస్తూ,ప్రతిస్పందిస్తూ భూతభవిష్యత్ వర్తమానాలలో పరిభ్రమిస్తూ, కవితాలాపన చేస్తూనే ఉంటాను.
కలాన్ని స్పశించని దినం దిగులు గడప గడియపడి, గడవని గడియ గుదిబండౌతుంది. అందుకే ఎన్ని అవాంతరాలు ముళ్లదారిలా కప్పినా కవితావక్షాన్నై భావాల ఫలాలు పండిస్తూ ఉంటా!
సాదాసీదా మధ్యతరగతి జీవితాన నాకో అస్తిత్వాన్నిచ్చి, సమాజంలో నన్ను ప్రత్యేకంగా నిలిపిన కవిత్వమంటే నాకు చాలా ఇష్టం. నేను కవిని. - వేమూరి శ్రీనివాస్, 9912128967