Authorization
Mon April 07, 2025 06:59:22 am
సృష్టిలోని పూరూపము
స్త్రీజాతికి నిజరూపము
తెలంగాణ బతుకమ్మ
ప్రకృతిమాత ప్రతిరూపము!
బతుకునిచ్చు బతుకమ్మ
నవరాత్రుల గౌరమ్మ
తీరు తీరు పువ్వుల్లో
నీకు సాటి లేరమ్మ!
పూలలోన చేరినావు
చైతన్యము నింపినావు
తెలంగాణ కోవెలలో
బతుకమ్మై వెలిసినావు!
పుడమిపైన పూలతల్లి
సకల కళల కల్పవల్లి
తెలంగాణ బింబమై
వెలిగెను బతుకమ్మతల్లి!
ఊరువాడ ఆటల్లో
ఉయ్యాలా పాటల్లో
ఊరెగును బతుకమ్మ
ఉత్సాహపు తోటల్లో!
వనంలోన మనంలోన
జనజాతర గణంలోన
ఖ్యాతిగాంచె బతుకమ్మ
స్వచ్ఛమైన గుణంలోన!
అవనిమీద బతుకమ్మ
అంతులేని శోభమ్మా
అన్యాయము నెదిరించిన
బతుకమ్మయె ధీరురాలు!
పోరాటము జేసింది
కడగండ్లను దాటింది
తెలంగాణ వెలుగునంత
ప్రపంచాన చాటింది!
- వడిచర్ల సత్యం
సెల్:9441350137