Authorization
Fri April 04, 2025 11:14:11 pm
నీ తొలిచూపుల సుకుమార స్పర్శలో
నా మనసొక నీలాకాశం
నీ చిరునవ్వుల నందనవనంలో
నా హృదయమొక ఎర్ర గులాబీ
నీ వెచ్చని ఆలింగనంలో
ఈ దేహమొక తన్మయ శిఖరం
నీ చల్లని ఓదార్పు మైమరపులో
ఈ జీవితమొక ఊదారంగు చిత్రం
నీ అధరాలు నా నుదిటిపై చుంబనం
చెరిగిపోని నారింజ వర్ణ సంతకం
నీ కనురెప్పలపై నిశిరాత్రి వాలిన వేళ
నేనొక ఇండిగో రంగు స్వప్న శకలం
మువ్వలకే సవ్వడినేర్పిన నీపాదాలకు
పసుపునద్ది ఆహ్వానం పలుకుతున్నా
ఏడు రంగుల్నీ ఏడడుగులుగా మలిచి
నాజీవనాకాశంలో హరివిల్లై పూయమన్నా!!
- వెన్నెల సత్యం, 9440032210