Authorization
Fri April 11, 2025 08:37:16 am
నవతెలంగాణ-మెహదీపట్నం
సీిఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా తయారైందిని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ విమర్శించారు. నాంపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ సీఆర్ఎం పీ రోడ్ల నిర్వహణ అధ్వానంగా తయారైందనీ, సంబంధిత ఏజెన్సీలు రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ పెండింగ్‌లో ఉన్న పలు పనులను తొందరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్, ప్రస్తుత మెహదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.