Authorization
Mon April 28, 2025 01:46:27 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఈనెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశానికి బాక్సింగ్‌లో బంగారు పతకాలు సాధించి పెట్టిన మహిళా మల్ల యోధులపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరత్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయనను వెంటనే అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ, రెజ్లర్ల జాతీయ సంఘానికి అధ్యక్షులైన బ్రిజ్ భూషన్ ను వెంటనే తన పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా, విచక్షణారహితంగా లాఠీచార్జీ చేయడాన్ని, ఇతర 10 కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధి నాయకులు, నిలువెల్ల గాయాలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు రక్షణ కల్పించాలని చేస్తు న్న ఆందోళనలకు జాతీయ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దేశవ్యాపితంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని నగరాల వరకు ఆందోళ నలు, నిరసనలు, కాగడాల ప్రదర్శనలు చేయాలన్న పిలుపులో భాగంగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలోని అన్ని జిల్లా సమితులు వెంటనే స్పందించాలని కోరారు. ఈ నెల 13న సాయంత్రం 7 గంటలకు హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి నిర్వహించే కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో ప్రజలు, కార్మికులు, క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.