Authorization
Fri April 11, 2025 08:25:31 am
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (హెచ్-64, ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై గురువారం విద్యుత్ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్ రావును ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, ఎలక్ట్రిసిటీ యూనియన్ అధ్యక్షులు రావుల మురళీ, కార్యదర్శి దుగ్గిరాల సుధాకర్ కలిసివినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలనీ, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ సమస్యను త్వరతగతిన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. లేని యెడల సమస్యలపై కార్మిక వర్గాన్ని కూడగట్టుకుని ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.