Authorization
Fri April 11, 2025 10:44:55 am
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ పరిధిలోని భవన్స్ కాలేజీ దగ్గర శనివారం కార్పొరేటర్ నూతన డివిజన్ ఆఫీస్ ను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ లోని ప్రజలందరూ నిత్యం ఏదో ఒక పని మీద ఆఫీసుకు వస్తుంటారనీ, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కాలనీ అధ్యక్షులు సారధి, మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, జీవగన్, మోటే సాయికుమార్, మహత్య వర్ధన్, చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిందం శ్రీను, శివకుమార్, మహేష్, రాజు, నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.