Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ నగరపాలక సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ జక్క వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి స్వచ్ నగర పాలక తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం నగరపాలక సంస్థ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డులో జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు చెత్త సెగ్రిగేషన్ పనితీరును మేయర్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డులో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనుల విషయాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రామకృష్ణారావు, ఏఈ, వినీల్, వర్క్ఇన్స్పెక్టర్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.