Authorization
Fri April 11, 2025 09:02:43 am
నవతెలంగాణ-ఓయూ
సీతాఫలంమండి డివిజన్లో ఎక్కడ కూడా చెత్త కనిపించకూడదని, శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఈమేరకు గురువారం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో శానిటేషన్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. శానిటేషన్ సిబ్బంది సేవలు మరింత విస్తృతం చేసి మారుమూల స్లమ్స్‌లో కూడా పరిశుబ్రతను పెంపొందించాలని సూచించారు. డివిజన్ వాసులకు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత నగర పాలక సంస్ధపై ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు డీసీ మోహన్ రెడ్డి, ఏఎమ్ హెచ్ ఓ రవీంద్ర పాల్గొన్నారు.