Authorization
Fri April 11, 2025 10:44:55 am
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
క్యాట్ డిగ్రీ కాలేజీలో 26వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఎం.మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఎందరో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. చదువుతో పాటు సంస్కారం, నైతిక విలువలతో కూడిన విద్యను తమ సంస్థ అందిస్తుందని సగర్వంగా చెప్పగలమని అన్నారు. ఇక్కడ అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి ఎన్నో అత్యుత్తమమైన ఉద్యోగాలు పొంది ఉన్నత శిఖరాలకు ఎదిగారని గుర్తు చేశారు. నైపుణ్యం కలిగిన అధ్యాపకుల బృందం ఉండటం వల్ల ఎంతో మంది విద్యార్థుల జీవితాలు బాగుపడ్డాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.