Authorization
Fri April 11, 2025 10:18:20 pm
హోం మంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఉర్సు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ హెచ్ఎంటీ కాలనీలోని హజ్రత్ జిందాషా మదార్ దర్గాలో బుధవారం నిర్వహించిన ఉర్సు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై చాదర్‌ను కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకు ముందు చంద్రనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మషాల్లాV్‌ా ఫర్నిచర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ రఫీ, మజార్, అజీమ్, దర్గా కమిటీ సభ్యులు అబ్దుల్ ఖాదర్, బాబా, నిజాం, గౌస్, జాకీర్, వరద రాజు, బాల్‌రెడ్డి, శ్రీశైలంయాదవ్, సాయికిరణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.