Authorization
Tue April 08, 2025 03:22:23 am
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ ముదిరాజ్ సంఘం కన్వీనర్‌గా మైసాని శేఖర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ ముదిరాజ్ సంఘం సభ నగర అధ్యక్షులు పొలం లక్ష్మీనారాయణ ముదిరాజ్ చేతుల మీదగా శేఖర్‌కు నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పసుల విజరు కుమార్, నగర యువత అధ్యక్షులు గుండు నరసింహ, నగర కార్యదర్శి అశోక్, గౌరీశంకర్, ఉదరు, దాస్, తదితరులు పాల్గొన్నారు.