Authorization
Tue April 08, 2025 03:04:43 am
నవతెలంగాణ- సిటీబ్యూరో
టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ ఎస్.ఎం హుస్సైనీ (ముజీబ్) ఆధ్వర్యంలో మంగళవారం మెహది నవాజజుంగ్ క్యాన్సర్ ఆస్పత్రిలో సుమారు 400 మంది రోగుల బంధువులకు, పేద ప్రజలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఒమిక్రాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజర్ వినియోగించాలనీ, భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ముజీబ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి యూనిట్ సభ్యులు సుధాకర్, శివ కుమార్, శేఖర్ పాల్గొన్నారు.