Authorization
Mon April 07, 2025 11:24:00 pm
నవతెలంగాణ- బాలానగర్
కార్డ్, ఆశ్రయ ఆకతి స్వచ్ఛంద సంస్థల సేవలు హర్షణీయం అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరధిలోని ఇంద్రానగర్‌లో కార్డ్, ఆశ్రయ ఆకతి స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయంతో దాదాపు 300 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ మాత్రమే ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉంటుదని, కరోనా విజంభణ సమయంలో ఎంతోమంది నిరుపేదలను ఆదుకున్నామని గుర్తుచేశారు. అదేవిధంగా కార్డ్, ఆశ్రయ ఆకతి సంస్థ నిర్వాహకులు నియోజకవర్గంలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ చేయడం హర్షించదగిన విషయమని కొనియాడారు. కార్యక్రమంలో కార్డ్ సేవా సంస్థ అధినేత సుమన్ మల్లాది, మంజుల మల్లాది, డి.పి కె. బాబు, ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవు వెంకట్ రెడ్డి, రామస్వామి, డాన్ కుమార్, శ్యామ్ సుందర్ రెడ్డి, బంగారయ్య, మోహన్ నాగరాజు, శేఖర్ సాగర్, వెంకట్ స్వామి, గిరి సాగర్, సురేఖా రెడ్డి, పారిజాత, లక్ష్మి, అనిల్, స్థానికులు పాల్గొన్నారు.