Authorization
Tue April 15, 2025 03:28:22 am
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్‌నగర్ డివిజన్లోని శ్రీ సాయినగర్ నుంచి శివసాయినగర్ కోర్టు గల్లీలో కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ సాయినగర్ ప్రజలు స్థానిక సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీ సాయి నగర్ లో భూగర్భ డ్రయినేజీ పనులు పూర్తయ్యా యనీ, నూతన రోడ్డు వేయాలనీ, కోర్టు పోలీస్ కమిషనర్ కార్యాలయం డ్రయినేజీ నీరు కాలనీ డ్రయినేజీలో కలవడంతో ఇబ్బందికరంగా ఉందని వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ నవీన్, ఏఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్, నాయకులు సర్వేష్, పంజా శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు రాఘవ పంతులు, స్థానిక ప్రజలు, బల్దియా, వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు.