Authorization
Wed April 02, 2025 09:13:18 am
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ డివిజన్ అభివృద్ధికి మూడు కోట్లు విడుదల చేశారని తెలియజేశారు. అందులో కోటిన్నర రూపాయలు మంచినీటి, సీసీ రోడ్ల కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. బసవతారక నగర్, నాయుడు నగర్, గౌతమ్‌నగర్, నవీన్‌నగర్, బీజేఆర్ నగర్, పటేల్‌నగర్, అంబేద్కర్ నగర్ బస్తీల్లో ఉన్న పలు రకాల సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. డివిజన్ పరిధిలో ఉన్న సీవరేజ్, తాగునీటి, రోడ్డు, కమ్యూనిటీ హాల్, స్థలం ఉన్న వారికి రూ.లక్షలతో నివాసం ఏర్పాటు, విద్యుత్ సమస్యలపై డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కటూర రమేష్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.