Authorization
Mon March 31, 2025 12:02:19 am
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
స్నేహమేనా జీవితం...స్నేహమేరా శాశ్వతం అంటూ ఆప్యాయంగా ఒకరికి ఒకరు పలుకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు అపూర్వ విద్యార్థులు. రాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 2003-04 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులు పెంటయ్య, ప్రభాకర్, శ్రీనివాస్, వెంకట్, అరవింద్, గోవర్ధన్ ఉపాధ్యాయులను సన్మానించారు.