Authorization
Thu April 03, 2025 12:18:43 am
నవతెలంగాణ-కల్చరల్
తెలుగువారి ఆరాధ్య గాయకులు ఘంటసాల గళం ప్రతి రూపంగా రమణ స్వరంలో పాట జాలు వారుతుందని, ఆయన మధుర సుధా గాన లోలుడు అని ప్రముఖులు కొనియాడారు. శ్రీత్యాగరాయ గాన సభలో మంగళవారం ప్రముఖ మహిళ సాంస్కతిక సంస్థ రాగ రాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహణలో పీవీ రమణ గళంలో ఘంటసాల పాటలు సుస్వరంగా పలికాయి. ప్రతి పాటకు శ్రోతలు పరవశించి ప్రశంసలు గుప్పించారు. ప్రముఖ గాయని రమణ కుమారి యుగళ గీతాలలో రమణతో గళం కలిపారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సమైఖ్య ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ కాకినాడ ప్రాంతీయుడైన రమణ ఘంటసాలకు ఏకలవ్య శిష్యునిగా విశేష సాధనతో మధుర గళం సాధించారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో అపర ఘంటసాలగా పెరు పొందారని అభినందించారు. గీతా రచయిత డాక్టర్ వడ్డేపల్లి కష్ణ అధ్యక్షత వహించిన సభలో డాక్టర్ రామాకాంత్, వీ శైలజ, గంజి శ్రీనివాస్, భరద్వాజ్ తదితరులు రమణను సత్కరించారు. ఆనంద్ వ్యాఖ్యానం ఆకట్టుకుంది. రమణ కుమారి స్వాగతం పలుకగా సుబ్బ లక్ష్మి వందన సమర్పణ చేశారు.