Authorization
Thu April 03, 2025 03:51:26 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఈ నెల 5, 6, 7వ తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు యేసురత్నం, సీపీఐ మండల కార్యదర్శి ఉమామహేష్ అన్నారు. మంగళవారం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలొని శివాజీ విగ్రహం వద్ద హమాలీ నాయకులతో కలిసి వారితో పాటు ఏఐటీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు హరినాథ్ పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. ఏఐటీయూసీ పోరాటం వల్లే అనేక కార్మిక సంక్షేమ చట్టాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగప్ప, ఏఐటీయూసీ నాయకులు కృష్ణ, రాములు, మహమూద్, నాజర్, జకీర్, యాకుబ్, మహబూబ్, సోమ్మన్న, కొమురయ్య, రాజిరెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.