Authorization
Sat April 05, 2025 03:20:46 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కరోనా కష్టకాలంలో ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనం పెంచుతూ ఫిబ్రవరి 1న జీఓ 37 విడుదల చేసింది. ల్యాబ్ టెక్నీషియన్ల వేతన పెంపుపై సీఐటీయూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు సంఘం నాయకులు ఎస్ సునీల్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు. తమ కష్టాన్ని గుర్తిస్తూ వేతనాలు రూ. 17 వేల నుంచి రూ. 21 వేలకు పెంచిన సీఎం కేసీఆర్‌కు, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి కి, కమిషనర్ వాకాటి కరుణకి, ఉద్యోగుల సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.