Authorization
Wed March 26, 2025 11:41:19 am
ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు
నవతెలంగాణ-ఓయూ
ఫిలాసఫీ డిపార్ట్మెంట్లోకి అక్రమ బదిలీలను రద్దు చేయాలని రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు సోమవారం ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపారు. సైఫాబాద్ పీజీ కళాశాలలో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ సబ్జెక్టు బోధించే సుధాకర్ అనే ఒప్పంద అధ్యాపకుడిని నిబంధనలకు విరుద్ధంగా నిజాం కళాశాలలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా చేయడం వల్ల యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని, తక్షణమే సుధాకర్ అనే వ్యక్తిని తొలగించాలని డిమాండ్ చేశారు.