Authorization
Wed March 26, 2025 04:47:15 am
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గం పరిధిలోని పార్క్‌లను పూర్తి స్థాయి వసతులతో అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. సోమవారం గోల్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వైభవ్ నగర్, సోమ సుందర్‌నగర్, రామకష్ణనగర్లలో పార్కు అభివద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్క్‌లను తీర్చిదిద్దాలని కోరారు. మోడల్ పార్క్‌ల మాదిరిగా పార్క్‌ల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని అన్నారు. కుమ్మరివాడి, భుర్జ్గల్లి, కుద్బిగూడ, చప్పల్ బజార్, పాముల బస్తీల్లో సిసి రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. బస్తీల్లో డ్రయినేజీ, మంచినీటి పైప్లైన్లతో పాటు ఇతర పనులేమైనా పెండింగ్‌లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, పార్టీ నాయకులు మహేష్, దిలీప్, అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.