Authorization
Tue March 25, 2025 08:14:10 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సంజీవనగర్ అధ్యక్షులుగా దుర్గాపతి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గతేడాది జరిగిన సంజీవనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో 88 ఓట్లు రాగా యాదయ్యకి 44, దుర్గాపతికి 44 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్‌లో ఇద్దరికి సరిసమానంగా రావడంతో బస్తీ వాసులు, ఎన్నికల కమిటీ, పేట్‌బషీరాబాద్ పోలీసుల సమక్షంలో ఇరువురు ఒక్కో సంవత్సరం అధ్యక్షులుగా ఉంటామని అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఇందుల్లో భాగంగా 2021 నుంచి 2022 వరకు యాదగిరి అధ్యక్షులుగా పూర్తి చేశారు. 2022 నుంచి 2023 వరకు దుర్గాపతి అధ్యక్షులుగా గురువారం బస్తీ వాసులు, ఎన్నికల కమిటీ, పోలీసుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.