Authorization
Tue March 25, 2025 04:53:29 am
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దళిత బహుజన పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గోదావరిఖని ప్రాంతానికి చెందిన మహంకాళీ మహేష్ ను నూతనంగా నియమించడం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఆయనకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్ నియామకపు ఉత్తర్వులు అందజేశామని పేర్కొన్నారు. అణగారిన కులాలకు రాజకీయ అధికార సాధన కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలోచనా విధానం వెలుగులో మహంకాళీ మహేష్ రాజకీయ పోరాటం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ సందేశ్ యాత్ర పేరుతో మార్చి 20న పెద్దపల్లి నియోజకవర్గంలో భారీసభను నిర్వహిస్తున్నట్లు కష్ణ స్వరూప్ తెలిపారు. తనను పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మహేష్ పార్టీ అధిష్టానం, జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్‌లకు కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి రాజు, పెద్దపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ పట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.