Authorization
Mon March 24, 2025 07:56:09 pm
నవతెలంగాణ-కల్చరల్
ఆదర్శ వాణి మాస పత్రిక శివ రాత్రి ప్రత్యేక సంచికను రాష్ట్ర పూర్వ మంత్రి, ప్రస్తుత శాసన సభ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆయన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు రాబోయే రోజుల్లో తమ సత్తా చూపుతారని, బీసీల ఐక్యత లక్యంగా తాను ఉద్యమిస్తానని తెలిపారు. ఆదర్శ వాణి సంపాదకుడు బాలరాజ్ గౌడ్, మేనేజర్ మంజుల, తెలుగు సాహిత్య కళా పీఠం అధ్యక్షులు చిక్కా రామ దాస్, భిక్ష పతి తదితరులు పాల్గొన్నారు.