Authorization
Tue March 25, 2025 05:37:15 am
నవతెలంగాణ-కేపిహెచ్బీ
హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని నందమూరినగర్ కాలనీలో తాగునీటి పైపులైన్ పనుల కోసం జలమండలి సిబ్బంది, కాలనీ వాసులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, లైన్మెన్ ఈశ్వర్, సునీల్, కాలనీ వాసులు అహ్మద్, నిజాం, జుబెద బేగం, బీజన్బీ, రాధ, రహిమ, హనిఫా, కోమల, తస్లీమా, జరీనా పాల్గొన్నారు.