Authorization
Sun March 23, 2025 07:27:20 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
50 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర గల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి. ఎస్. ప్రకాష్, సురేష్ కవిరాయని జనరల్ సెక్రెటరీగా, ఎం.లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రెటరీలుగా ఎస్.నారాయణరెడ్డి, ఎం.డి.అబ్దుల్, ట్రెజరర్‌గా పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి.మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరి సహకారంతో సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.