Authorization
Sat March 22, 2025 06:41:37 pm
- కన్వీనర్ మలపాక వీరయ్య
నవతెలంగాణ-సరూర్నగర్
ఈనెల 28, 29 తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సరూర్నగర్ సీఐటీయూ కన్వీనర్ మల్లేపాక వీరయ్య కోరారు. ఆదివారం సరూర్నగర్ సర్కిల్లోని పరిధిలోని సరూర్నగర్ సర్కిల్ లేబర్ అడ్డా దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో సరూర్నగర్ లేబర్ అడ్డా అధ్యక్షులు సిహెచ్ నవీన్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా సరూర్నగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ మల్లెపాక వీరయ్య హాజరై మాట్లాడుతూ ఈనెల 28, 29 దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్మిక, వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, అనేక స్వతంత్ర అఖిలభారత ఫెడరేషన్లు అఖిలభారత సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సార్వత్రిక సమ్మెలో ఆటో, ట్రాలీ, క్యాబ్, డీసీఎం, లారీ, స్కూల్ బస్, అంబులెన్స్, ట్రాక్టర్, మినీ డీసీఎం, జేసీబీ, ట్రక్కు మెకానిక్ ఆపరేటర్స్ తదితరులంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఐటీయూ నాయకులు రాములు, శంకర్, భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు పాల్గొన్నారు.