Authorization
Sat March 22, 2025 08:29:54 am
- సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని వెల్లడి
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆందోజ్ సత్యంచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మే రెడ్డి ఉదరు కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆర్.డి.ఎల్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో సంక్షేమ భవనంతో పాటు సీసీి కెమెరాలను ఏర్పాటు చేయలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశామన్నారు. అనంతరం సమస్యల పట్ల సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించారని, సంక్షేమ సంఘ భవనంకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ వచ్చే విడతలో సీసీి కెమెరాల ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కాలనీ అధ్యక్షుడు
కే.రాంప్రసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి, ఎన్.కరుణాకర్ రెడ్డిలు తెలిపారు. డివిజన్ అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తున్న ఎమ్మెల్యే సేవలు మరువలేనివని, నియోజకవర్గంలో ప్రతి కాలనీని ఉన్నతంగా తీర్చిదిద్దటమే ఎమ్మెల్యే లక్ష్యమని సత్యంచారి, ఉదరు కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ వి.రమేష్‌గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సాయికుమార్, కార్యనిర్వాహక సభ్యులు బి.వెంకటయ్య, ఎల్.నర్సిరెడ్డిలతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.