Authorization
Sat March 22, 2025 08:36:05 am
- కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
నవతెలంగాణ-వనస్థలిపురం
హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి ఉదయం పర్యటనలో భాగంగా ఆదివారం డివిజన్లోని కమలంనగర్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. కార్పొరేటర్ అనంతరం శారదానగర్ కాలనీ అధ్యక్షులు నర్సింహారావుతో కలసి కాలనీలో జరుతున్న నాలాలోని శిల్ట్ తొలగింపు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివద్ధి పనుల్లో రాజీలేని పోరాటం చేస్తానని. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో కమలనగర్ కాలనీ శానిటేషన్ సూపర్వైజర్ రాజ్ కుమార్, శారదా నగర్ కాలనీ శానిటేషన్ సూపర్వైజర్ మధు, కమలం నగర్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, బీజేపీ నాయకులు సంఘీ అశోక్ , తదితరులు పాల్గొన్నారు.