Authorization
Fri March 21, 2025 01:50:17 am
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళా మండలి అధ్యక్షురాలు మైలారం పద్మ నాయి చేతుల మీదుగా జంపాల భిక్షపతి కూతురు వివాహానికి చిరు కానుకగా పుస్లె- మట్టెలు, కొంత ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు ఏ.రేనయ్య నాయీ, ప్రధాన కార్యదర్శి కె.పరమేశ్ నాయీ, చైర్మెన్ ఎస్.రవి బాబు నాయీ, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సురేష్ నాయీ, క్యాషియర్ వి.మహేందర్ నాయీ, సలహాదారులు ఎం.భిక్షపతి నాయీ పాల్గొన్నారు.