Authorization
Wed March 19, 2025 06:00:07 am
- ఆర్కె పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి
నవతెలంగాణ-సరూర్‌నగర్
మొక్కలతోనే జీవరాశి మనుగడ అని ఆర్కె పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అన్నారు. డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీ రోడ్ నెంబర్-2లో హరితహారం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనఅందరినీ రక్షిస్తుంది అని తెలిపారు. భావితరాల వారికి ఆరోగ్యకరమైన వాతావరణం లో అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రమేష్‌గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ పాల్గొన్నారు.