Authorization
Wed March 19, 2025 04:29:36 am
నవతెలంగాణ-కల్చరల్
కాళోజి భాష ప్రజల భాష అని అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై తెలుగుభాషా చైతన్య సమితి, తెలంగాణ రచయితలు సంఘం లక్ష్య ఫౌండేషన్ నిర్వహణలో పాలడుగు నాగయ్య కళా పీఠం సౌజన్యంతో కాళోజీ పేరిట ప్రముఖ సాహితీవేత్తలకు విశిష్ట పురస్కార ప్రదానోత్సవం సభ జరిగింది. ముఖ్య అతిధులుగా బి.సి. కమిషన్ అధ్యక్షులు డాక్టర్ వకులళా భరణం కష్ణ మోహనరావు శ్రీదేవిలు పాల్గొని పురస్కరాలు బహుకరించి మాట్లాడారు. శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల వాడుక భాష అధికార భాష కావాలని కాళోజీ ఆశయమని తెలిపారు. డాక్టర్ కష్ణమోహనరావు మాట్లాడుతూ కాళోజీ కవితలు తెలంగాణ మాండలికాలని, కవులు ఆయన శైలిలో రాసి తెలంగాణ భాషకు ప్రాధాన్యమీయాలని అన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్రా అధ్యక్షుడు డాక్టర్ నలేశ్వరం శంకరం, రవీంద్ర, ప్రజ్ఞా రాజు, సరోజిని తదితరులు పాల్గొన్న సభకు బడేసాబ్ స్వాగతం పలికారు. డాక్టర్ రాధా కుసుమ నిర్వహణలో కవి సమ్మేళనం జరిగింది.