Authorization
Wed March 19, 2025 05:01:35 am
నవతెలంగాణ-జవహర్ నగర్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ బస్తీల్లో ఇండ్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్ రూంల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారనీ, కొందరికి మంజూరు సైతం అయ్యాయనీ, కిరాయి ఇండ్లలో ఉన్న పేదలు మరో ప్రాంతానికి మారడం వల్ల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు మారడం వల్ల సమాచారం తెలియడం లేదనీ, మరోసారి సర్వే చేసి మంజూరైన వారికి సమాచారం తెలియజేసి ఇండ్లివ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డికి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి శంకర్, కాప్రా మండల ప్రధాన కార్యదర్శి దర్శనం యాదగిరి, గిరిప్రసాద్ నగర్ శాఖ సెక్రటరీ మోతే రాజేశ్వరి, గిరిజన సమాఖ్య రాష్ట్ర కోశాధికారి వి. స్వరూప, ఏఐవైఎఫ్ కాప్రా ఉపాధ్యక్షులు పి.లక్ష్మణ్, కీసర మండల సహాయ కార్యదర్శ రవి నాయక్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.