Authorization
Wed March 19, 2025 05:46:34 am
నవతెలంగాణ-కాప్రా
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజనబంధు పథకం ప్రెకటన చేసిన సందర్భంగా కాప్రా తహసీల్దార్ ఆఫీస్ చౌరస్తా దగ్గర కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, సరిత నాయక్, శ్రీను నాయక్, డివిజన్ సీనియర్ నాయకులు నాయకురాలు, లంబాడి సోదరీమణులు పాల్గొన్నారు.
చక్రీపురం చౌరస్తాలో..
గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ జీవో జారీ చేస్తామని గిరిజన ఆత్మీయ సభలో ప్రకటించిన సంధర్బంగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని చర్లపల్లి డివిజన్ చక్రిపురం చౌరస్తాలో సీఎం కేసిఆర్ చిత్రపటానికి క్షీరిభిషేకం చేసిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో గిరిజన కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వాల్యా నాయక్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హన్మంతు నాయక్, నాయకులు దశరథ్ నాయక్, జమ్ల నాయక్, శేఖర్ నాయక్, సతీష్ నాయక్, మహిళ నాయకురాలు లలిత నాయక్, ఉమ నాయక్, కవిత నాయక్, తదితరులు పాల్గొన్నారు.