Authorization
Wed March 19, 2025 02:45:53 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఈనెల 20న సిటీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ బాల భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రిలేషన్షిప్ మేనేజర్ పోస్టు కోసం ఉదయం 10 గంటలకు వాక్ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు. ఏసబ్జెక్టులోనైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, 25 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లను తమతో తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్: 8977599042, 8977599042, 9676210471 లకు సంప్రదించాలని కోరారు.