Authorization
Wed March 19, 2025 04:29:29 am
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో నాటక రచనపై అక్టోబరు 27 నుంచి 31వ తేదీ వరకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు రసరంజని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణ, కార్యదర్శి ముట్నూరు కామేశ్వర రావు తెలిపారు.
గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు 21-35 ఏండ్ల మధ్య వయస్సువారు దరఖాస్తు అక్టోబర్ 12లోగా చేసుకోవాలని కోరారు. శిక్షణకు హాజరు అయ్యే వారికి ఉచిత వసతి, భోజన ఏర్పాటు చేస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంత యువతీయువకులకు ప్రాధాన్యత ఇస్తామని, శిక్షణ కాలం అనంతరం వారిచే నాటక రచన చేయించి పారితోషికం కూడా అందిస్తామని తెలిపారు. ప్రముఖ నాటక రచయిత శ్రీశైల మూర్తి నిర్వహణలో జరిగే ఈ శిక్షణా శిబిరంలో నాటక రంగ ప్రముఖ రచయితలు పాల్గొంటారని చెప్పారు. అసక్తికలవారు తమ వివరాలను స్వీయదస్తూరితో దరఖాస్తును 9951155499 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపాలని సూచించారు. సమావేశంలో కోశాధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.