Authorization
Wed March 19, 2025 06:57:29 am
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అంతర్గత రహదారులపై మ్యాన్‌హోల్స్ నోళ్లు తెరుచుకుని ప్రమాదకరంగా మారాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల క్యాంటీన్‌కు వెళ్లే రోడ్డు, స్విమ్మింగ్‌పూల్, మంజీరా హాస్టల్ ఎదుట మ్యాన్‌హోళ్లకు కనీసం మూతలు కూడా లేవు. దీంతో ఇటీవలే ఒక విద్యార్థి క్యాంటీన్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. అలాగే లేడీస్ హాస్టల్ ఎడమ వైపు నుంచి ప్రధాన రహదారికి వెళ్లే చోట భారీగా గుంతలు ఏర్పడటంతో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓయూ అధికారులు తక్షణమే స్పందించి మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు.