Authorization
Wed March 19, 2025 06:00:02 am
నవతెలంగాణ-సరూర్‌నగర్
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ మైయిన్ రోడ్డు మీద ఉన్న బిల్లాల్ మసీద్ (ఈద్గా) అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రూ.51 వేలను మసీద్‌కు సంబంధించిన సదర్ అష్రఫ్‌కు అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు రహీమ్, అక్బర్, జహంగీర్, కాంగ్రెస్ నాయకులు వంగాల శ్రీకాంత్ రెడ్డి, శేఖర్, విప్లవ్, పగిళ్ల పురుషోత్తం, అశోక్, జగదీష్ పాల్గొన్నారు.