Authorization
Wed March 19, 2025 04:29:30 am
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్‌లో తాగునీటి నిర్వహణను హైదరాబాద్ వాటర్ సీవరేజ్ బోర్డు ద్వారా నిర్వహించాలని 23వ డివిజన్ కార్పొరేటర్ జి. శ్రీనివాస్ యాదవ్, 5వ డివిజన్ కార్పొరేటర్ చల్లా ఇంద్రజిత్ రెడ్డి శుక్రవారం హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్‌ను వినతిపత్రం అందజేశారు. మంచి నీటి సరఫరా, నిర్వహణ బాధ్యతలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించవద్దని కోరారు. నీటి సమస్యను, మోటార్ల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించి సదరు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, త్వరలో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు రాములు నాయక్ పాల్గొన్నారు.