Authorization
Wed March 19, 2025 05:21:54 am
- కుత్బుల్లాపూర్ ఎన్పీఆర్డీ అధ్యక్షులు జె. మల్లేష్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
డిసెంబర్ 26 నుంచి 28 వరకు జరిగే అఖిల భారత మహసభలను విజయవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎన్పీఆర్డీ అధ్యక్షులు జే.మల్లేష్ కోరారు. జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దళిత బంధులాగే వికలాంగుల బంధు అమలు చేయాలన్నారు. ప్రతి వికలాంగుడికి పదివేల పెన్షన్ మంజూరు చేయాలని, ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. రేషన్ కార్డు అంతోదయ కార్డ్స్ అమలు చేసేవరకు వికలాంగులంతా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అఖిల భారత మహసభలకు రాష్ట్రం నలుమూలల నుండి వికలాంగులంతా తరలి రావాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మల్లేశ్తోపాటు సందీప్ రారు, ఆదర్శ్, మంజు రాణి, బాలరాజ్ నారాయణలను నూతన కమిటీకి ఎన్నికయ్యారు.