Authorization
Wed March 19, 2025 01:59:03 pm
నవతెలంగాణ-ఓయూ
సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) ఓపెన్ డేకు అనూహ్య స్పందన లభించింది. ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, పరిశోధన ల్యాబ్స్‌ను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూల్స్ నుంచి సుమారు 7000 విద్యార్థులతో పాటుగా పీహెచ్డీ విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 26న ఓపెన్ డేను నిర్వహిస్తున్నట్లు సీసీఎంబీ డెరైక్టర్ డా.వినరు చెప్పారు. స్కూల్ స్థాయిలోనే సైన్స్ విద్యా పట్ల ఆకర్షణ, సృజనాత్మక ఆలోచనలు రావడం కోసం ఈ ఓపెన్ డే విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందన్నారు. మరొక వైపు విద్యార్థులు ఎంతో ఉత్సహంగా ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు తిలకించారు. వారికి సైంటిస్టులు వివిధ అంశాలపై వివరించారు.