Authorization
Wed March 19, 2025 07:33:07 am
నవతెలంగాణ- సిటీ బ్యూరో
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, సేవా రత్న డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) నేతృత్వంలో జిల్లా కార్యవర్గం, యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముజీబ్ మాట్లాడుతూ... తెలంగాణ వీరనారి ఐలమ్మ విసునూరు దేశ్‌ముఖ్‌ను ఎదిరించి తన భూమి కోసం చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బాటలు వేసిందన్నారు. ఆ తరువాత ఆమె అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. దొరలకు భయపడకుండా అన్యాయాన్ని ఎదరించి పోరాడిన ధీరవనిత ఐలమ్మ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి విక్రమ్, ఉపాధ్యక్షులు కె. ఆర్. రాజ్ కుమార్, కుర్రడి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు వైదిక్ శస్త్ర, నాలుగవ తరగతి సహా అధ్యక్షుడు ఎం.ఎ.ముజీబ్, యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు టి. రాజు, కుతుబుద్దీన్, శ్రీధర్ నాయుడు, పిఆర్ఓ జహంగీర్ అలీ, ఏపీఆర్ఓ ఎండి. వహీద్ పాల్గొన్నారు.