Authorization
Wed March 19, 2025 07:09:11 am
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
డ్రయినేజీ పైప్ లైన్ పనుల్లో జాప్యం చేయవద్దని, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని ఏఎస్రాజునగర్వద్ద సుమారు రూ.63.00 లక్షలతో చేపడుతున్న పైప్‌లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాలలో అభివద్ధి చేస్తానన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, చిరంజీవి రాజు, రాజు సాగర్, కృష్ణ, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.