Authorization
Wed March 19, 2025 07:09:11 am
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాల యంలో జాయింట్ సెక్రెట ఎస్.సుమలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్డికపుల్ లోని రాష్ట్ర హౌం మినిస్టర్ మహమూద్ అలీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల సందర్భంగా సుమలత మాట్లాడుతూ రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండగ ఎంతో ముఖ్యమైనదన్నారు. మహిళలందరూ సామూహికంగా కలిసికట్టుగా సంస్కృతిని ఉట్టి పడే విధంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే ప్రధానమైన వేడుక అన్నారు. ప్రకృతిలోని రకరకాల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పాటలను పాడుతూ, ఆడుతు ఎంతో కుతుహలంగా ఈ వేడుకలను నిర్వహించు కుంటారని తెలిపారు. ఈ సంబరాల్లో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.