Authorization
Tue March 18, 2025 11:34:14 am
నవతెలంగాణ-జవహర్‌నగర్
కార్పొరేషన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నామని మేయర్ మేకల కావ్య అన్నారు. శుక్రవారం జవహర్ నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన రూ.100.40 లక్షల అభివృద్ధి పనులకు పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి డివిజన్లో రోడ్లు సరిలేని చోట మట్టినిపోసినందుకు రూ.8 లక్షలను నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి వెచ్చించినట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానకు వెళ్లే రహదారి సరి లేనందున రోడ్డు మరమ్మతులకు రూ 1.లక్ష చెల్లింపునకు తీర్మానాన్ని చేశారు. డ్వాక్రా భవనానికి పెయింటింగ్ పనుల నిమిత్తం 1.లక్ష సాధారణ నిధుల నుంచి చెల్లించేందుకు తీర్మాని ంచారు. డివిజన్లలో ఉన్న పెండింగ్ పనులకు ప్రతి డివిజ న్కు రూ.5లక్షలు, 15వ ఫైనాన్స్ నుంచి 28 డివిజన్లకు ఆమోదించారు. జవహర్ నగర్ కార్పొరేషన్‌ను ఆదర్శవంతమైన నగరంగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్యోతిరెడ్డి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ అధికారులు ప్రభాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.