Authorization
Mon March 17, 2025 08:59:50 pm
- కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్ డివిజన్ హయత్‌నగర్ పరిధిలోని మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా రాజరాజేశ్వరి కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి శనివారం స్ధానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి అక్కడ నెలకొన్న సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రధానంగా కాలనీలో మిగిలి ఉన్న భూగర్భ డ్రెయినేజీ, వాటర్ లైన్లను పూర్తిచేయాలని, కాలనీ సంక్షేమ భవనం మరో అంతస్తును నిర్మించడానికి చేయాలని దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. డివిజన్ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని సమస్యలను అధిగమించి దశలవారీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు జంగారెడ్డి, బిక్షపతి, శ్రీనివాస్, భాస్కర్, వెంకట్‌రెడ్డి, నరసింహ, జాన్, రఘునందన్ నాయకులు కొండల్ రెడ్డి, కడారి యాదగిరి, పారంద సాయి తదితరులు పాల్గొన్నారు.