Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శివారు ప్రాంతాలే అడ్డా | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 07,2022

శివారు ప్రాంతాలే అడ్డా

- ఇతర రాష్ట్రాలకు గంజాయి, నగరానికి డ్రగ్స్‌, ఎర్రచందనం సరఫరా
- పోలీసుల కండ్లు గప్పి దందా
- మాదక ద్రవ్యాల మాఫియాను అరికట్టాలంటున్న ప్రజలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
            మాదకద్రవ్యాల మాఫియాలు, ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. యువకులను, విద్యార్థులను, ఉన్నతవర్గాలు, సీనీ పరిశ్రమకు చెందిన వారితోపాటు ఐటీ ఉద్యోగులను డ్రగ్స్‌ మాఫియా ఎంచుకుంటుంటే, ఎర్రచందనం స్మగ్లర్లు వ్యాపారులకు గాలం వేస్తున్నారు. హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని నగర శివార్లును ఎంచుకుని కొందరు డ్రగ్స్‌ను, గంజాయిని, ఎర్రచందనాన్ని డంప్‌ చేస్తున్నారు. మరికొందరు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా గుట్టుచప్పుడు కాకుండా చేరాల్సిన చోటుకు చేరుస్తున్నారు.
పీడీ యాక్టు నమోదు చేసినా...
            ఒక్కసారి మాదకద్రవ్యాలకు అలవాటైన వారే బానిసలుగా మారి గంజాయి, డ్రగ్స్‌ సరఫరాదారులుగా, ఏజెంట్లుగా మారుతున్నారు. వీరిని ఆసరా చేసుకుని స్మగ్లరు రెచ్చిపోతున్నారు. రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా వేసినా, పీడీ యాక్టులు నమోదు చేసినా గుట్టుచప్పుడు కాకుండా పనిగానిస్తున్నారు. డ్రగ్స్‌స్మగ్లర్లు గోవా, ముంబాయి, ఢిల్లీ, కర్ణాటక, బెంగుళూరు తదితర రాష్ట్రాల నుంచి సరఫరా చేస్తుంటే, గంజాయి స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్‌, ఒడిస్సా, ఛత్తీస్‌గడ్‌తోపాటు తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొస్తున్నారు. నగరంలోని శివారు ప్రాంతాల్లో వాటిని నిల్వచేస్తున్నారు. ఇక్కడి నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ముంబాయి తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌ సరఫరాపై పోలీసులు ప్రత్యేక నిఘా వేసినా, దేశవ్యాప్తంగా ఉన్న స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నా మాదక ద్రవ్యాల దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. వారి నుంచి రూ.2కోట్ల 80 లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా మూడు రోజుల క్రితం నగర పోలీసులు ఎర్రచందనం ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితుల నుంచి రూ.75లక్షల విలువగల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రతీనెల ఏదోచోట గంజాయి పట్టుపడుతూనే ఉంది.
రాష్ట్రాలు దాటుతున్నా...
            దేశవ్యాప్తంగా ఎర్రచందనం, మాదక ద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయంటే స్థానికంగా కొందరు పోలీసులు, సంబంధిత అధికారుల సహాయసహకారాలు లేకపోలేదన్న విమర్శలున్నాయి. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తదితర రాష్ట్రాల సరిహద్దులు దాటి హైదరాబాద్‌ శివారు ప్రాంతాల వరకు గంజాయి చేరుతోంది. ఆయా చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంటుంది. అయినా అవి దాటి కిలోలకొద్ది గంజాయి, క్వింటాళ్ల కొద్ది ఎర్రచందనం లోడుతో ట్రక్కులు, డీసీఎంలు, కార్లు సిటీలోకి ప్రవేశిస్తున్నాయంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
సహకరించని స్థానిక పోలీసులు
            గోవా, ఢిల్లీ, ముంబాయి, రాజస్థాన్‌, బెంగుళూరు తదితర రాష్ట్రాల్లో అడ్డావేస్తున్న నైజీరియన్లతోపాటు స్థానిక స్మగ్లర్లు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుం టున్నారు. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ, చరస్‌, ఎక్స్‌టసీ వంటి మాదకద్రవ్యాలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. బీటెక్‌, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలను, యువతను టార్గెట్‌ చేసుకుని డ్రగ్స్‌ దందా కొనసాగిస్తున్నారు.
            మాఫియాల ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించిన హైదరాబాద్‌, రాచకొండ పోలీసులు డ్రగ్స్‌ మూలాలపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ కలిగివున్న స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. గోవా ముంబాయి, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దర్యాప్తులో భాగంగా మన పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి విచారణ చేపడితే ప్రధాన స్మగ్లర్లకు తెలిసిపోతోంది. డ్రగ్స్‌, గంజాయి మాఫీయాకు అడ్డుకట్ట వేసే దిశగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.