Authorization
Sun March 16, 2025 10:29:37 pm
- డంపింగ్ వాసనతో ప్రజలకు ఇబ్బందులు
- చుట్టుపక్కల ప్రాంతాలు కలుషితం
- భారీ శబ్దాలతో భయపడుతున్న ప్రజలు
నవతెలంగాణ-జవహర్ నగర్
జవహర్‌నగర్‌లో డంపింగ్ దుర్వాసతో చుట్టుపక్కల ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. భూగర్భ జాలాలు విష వాయువులతో నిండిపోయాయి. భారీ శబ్దాలతో ప్రజలు తులపులు మూయాల్సిందే. లేకుంటే ఇంట్లోకి పెద్ద పెద్ద చెత్తకుప్పలు పడే సందర్భాలు చెప్పలేనన్ని ఉన్నాయి. డంపింగ్ పరిసరా ప్రాంతాలల్లో పూర్తిగా నిరుపేద ప్రజలే నివసిస్తున్నారు. దుర్వాసనతో అనారోగ్యం పాలవుతూ హాస్పిటల్స్‌లో చేరాల్సి వస్తోంది.
కలుషిత జాలాలతో అనారోగ్యం..
డంపింగ్ నుంచి వచ్చే రసాయనాలు ఇండ్ల మధ్యలో నుంచే పారుతూ భుగర్భ జలాలు కలుషితం అయ్యాయి. గుక్కెడు నీరు తాగాలంటే తాగలేని పరిస్థితి నెలకొంది. దద్దుర్లు, విరేచనానలతో ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కనీస వసతులు పాటించకుండా రాంకీ సంస్థ ప్రజల ప్రణాలతో చెలగాటం అడుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
అభివృద్ధి చేస్తామన్నన మాటలు ఉత్తిదే..
డంపింగ్ చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పిన మాటలు గాలి మాటలేననీ, ప్రజల ప్రాణాలే పోతుంటే స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. రాంకీ సంస్థ ప్రజల జీవితాలతో ఆడుకుంటుందనీ, డంపింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.