Authorization
Wed March 19, 2025 07:09:05 am
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ కార్మికులకు జీవో 60 ప్రకారం కనీస వేతనం రూ.15,600 ఇవ్వా లని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వారం రోజుల పాటు ప్రతి కార్మికుడూ నల్ల బ్యాడ్జి ధరించి పని చేస్తూ నిరసన తెలపాలని సీఐటీయూ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్. శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ మహమ్మద్, క్యాషియర్ షీలా, పద్మ, విటల్, సుల్తానా పాల్గొన్నారు.